పాతాళంలోకి కారు పోతుందా.. రేవంత్ పోతాడా చూద్దాం: ఎమ్మెల్యే గోపినాథ్

బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతిలో పాతిపెడతామని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పాతాళంలోకి పోతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్

Update: 2024-01-20 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతిలో పాతిపెడతామని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పాతాళంలోకి పోతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కారు పాతాళంలోకి పోతుందా.. రేవంత్ రెడ్డి పాతాళంలోకి వెళ్తాడా అన్నది ముందు ముందు తెలుస్తోందని కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు.. ఆ పార్టీ విధించిన 100 రోజుల డెడ్ లైన్ వరకు ఆగుదామనుకుంటే కాంగ్రెస్ నేతలే తొందరపడుతున్నారని అన్నారు. దరఖాస్తుల పేరిట తమ ప్రభుత్వం హయంలో పేదలను లైన్‌లో నిలబెట్టలేదని కాంగ్రెస్ సర్కార్ చేప్టటిన ప్రజా పాలన కార్యక్రమంపై సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 100 రోజుల రోజుల్లో అమలు చేయపోతే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. 

Tags:    

Similar News