బీఆర్ఎస్‌లో మరో వికెట్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు.

Update: 2024-07-13 14:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, మహిపాల్ రెడ్డి ప్లేట్ ఫిరాయించడంతో గులాబీ పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది.

ఆయన కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్‌గా హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిందని.. ఆ లక్ష్యం పూర్తి అయ్యే ఎమ్మెల్యే చేరికల పర్వం కంటిన్యూ అవుతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల వలసలను అడ్డుకునేందుకు నేరుగా గులాబీ బాస్ రంగంలోకి దిగి బుజ్జిగిస్తోన్న ఎమ్మెల్యేలు మాత్రం అధినేత మాటను బేఖాతారు చేస్తూ అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. 

Tags:    

Similar News