ఈటల ఫోన్‌లో ఏం దొరకలే.. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నోటీసులు అందుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తన పీఏ, ఇద్దరు న్యాయవాదులతో కలిసి సోమవారం మధ్యాహ్నం హన్మకొండ డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్‌వో కమలాపూర్, సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నోటీసులు అందుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తన పీఏ, ఇద్దరు న్యాయవాదులతో కలిసి సోమవారం మధ్యాహ్నం హన్మకొండ డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్‌వో కమలాపూర్, సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ తన సెల్ ఫోన్‌ను విచారణ అధికారులకు అప్పగించారు. పోలీసులు అడకముందే తన ఫోన్‌ను అధికారులకు అప్పగించారు. అధికారులు ఫోన్ ఆన్ చేసి స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేశారు.
వాట్సప్‌లో మహేష్ నుంచి ఎస్‌ఎస్‌సీ హిందీ పేపర్ వాట్సాప్‌లో వచ్చినప్పటికీ ఆయన మెసేజ్ ఓపెన్ చేయలేదు. ఈ విషయాన్ని విచారణ అధికారులు నిర్ధారించారు. తమ వద్ద ఉన్న 15 నెంబర్లతో ఈటల రాజేందర్ ఏమైనా చాటింగ్ చేశారా? అని పోల్చి చూశారు. సదరు 15 నెంబర్ల నుంచి ఎలాంటి వాట్సాప్ చాటింగ్‌లు కానీ, పోస్టింగ్‌లు గాని వారికి ఏమి కనిపించలేదు. దీంతో విచారణ అధికారులు సెల్ ఫోన్ తిరిగి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. విచారణకు ఈటల రాజేందర్ పూర్తిగా సహకరించాడరని అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కూపీ లాగుతున్న అధికారులు
ఈ కేసులో నిందితునిగా ఉన్న ప్రశాంత్ ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంపించాడు. ఈ అంశానికి సంబంధించి వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, ఎమ్మెల్యే ఈటలకు ఈనెల 6న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందస్తుగా షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా 10వ తేదీన విచారణకు వస్తానని ఈటల సమాధానమిచ్చారు. ఈ క్రమంలో నేడు వరంగల్ పోలీసుల ముందు ఈటల హాజరయ్యారు. కాగా ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈటెల పీఏలు రాజు, నరేందర్‌లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగా వారిరువురి స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అలాగే ప్రశాంత్ హిందీ పేపర్‌ను పంపించిన వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు. అలాగే వారి ఫోన్లను పరిశీలించారు.
Also Read..