యాదాద్రి కొండపైకి పోలీసులను ఆటోలో తీసుకెళ్లిన MLA

ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య రూటే సపరేటు. ఆదివారం ఆయన ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-02-11 14:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య రూటే సపరేటు. ఆదివారం ఆయన ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రిలో పర్యటించిన ఆయన గుట్టపైకి ఆటోలో వెళ్లారు. స్వయంగా ఆటోను తానే నడుపుతూ పోలీసులను అందులో కూర్చొబెట్టుకొని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి సింపుల్‌గా ఆటోలో వెళ్లడం, అదికూడా స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 మార్చి 22న ఆటోలను యాదాద్రి గుట్టపైకి నిషేధించింది. దీంతో దాదాపు 200 లకు పైగా ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలకు అనుమతిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ్టి నుంచి ఆటోలను కొండపైకి అనుమతించారు. దీంతో రెండేళ్ల పోరాటానికి తెర పడటంతో పాటు స్వయంగా ఎమ్మెల్యే ఆటో నడుపుతూ కొండపైకి తీసుకెళ్లడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News