జీవో 317 పై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం

జీఓ 317 ఉద్యోగుల సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన, సభ్యులు మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు, ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశం నిర్వహించింది.

Update: 2024-03-15 03:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీఓ 317 ఉద్యోగుల సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన, సభ్యులు మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు, ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ఆధ్యర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం ప్రధాన కార్యదర్శి కే.గౌతం కుమార్, ఉపాధ్యక్షులు కే.నిరంజన్, నిజామాబాద్ అధ్యక్షులు రమణా రెడ్డి తదితరులు కలిసి జీఓ317 రెవేన్యూూ ఉద్యోగుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా వినతి పత్రాన్ని అందజేసింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 317ను మరోసారి పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ట్రెసా తరుపున మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. అందులో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పేర్కొన్నారు.

ఉద్యోగులు సమర్పించిన నివేదిక

గత ప్రభుత్వం జీఓ 317ను తీసుకువచ్చి చెట్టుకొకరిని, పుట్టకొకరిగా విసిరేసిందని అలా కాకుండా స్థానికతను ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగులను వారి కోరిక మేరకు వారి వారి స్థానిక జిల్లాలకు బదిలీకి అవకాశం కల్పించాలని కోరారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించాలి. జిల్లా స్థాయిలో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ లను తమ పూర్వ జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఉద్యోగులకు వారి చికిత్సకు అవకాశం ఉన్న కోరుకున్న జిల్లాలకు కేటాయించాలని, ఆశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థను రద్దు చేసి పూర్వజిల్లాను ఒక జోన్‌గా ప్రకటించాలని కోరారు.

అదేవిధంగా పూర్వ జోన్‌లను ఒక మల్టీ జోన్ గుర్తించాలని సూచించారు. 2020 డిప్యూటీ తహశీల్దార్ లను వాఫై5 సొంత జిల్లాలకు, దగ్గర జిల్లాలకు కేటాయించాలని, అలాగే మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ట్రెసా కోరింది. కొత్తగా జరిపే కేటాయింపుల విషయంలో అందరికి సర్వీస్ సీనియారిటీ రక్షణ కల్పించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం వీఆర్‌ఏలకు స్కేల్ మంజూరు చేసి జిల్లాస్థాయి పరిధిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించి వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ట్రెసా ప్రతినిధులు కోరారు.

Tags:    

Similar News