బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి, పొన్నం సమీక్ష
బడ్జెట్ ప్రతిపాదనల కోసం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్ ప్రతిపాదనల కోసం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రవాణా శాఖలో వస్తున్న ఆదాయం, వ్యయాలు కేటాయింపులు.. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా శాఖకు గతంలో కేటాయించిన బడ్జెట్, కొత్త స్కీమ్‌ల అమలు నేపథ్యంలో ఈసారి పెంచాల్సిన నిధుల మొత్తంపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు.