'అమరుల స్మార చిహ్నం ఆవిష్కరణ' ప్రారంభోత్సవంపై అధికారులతో మంత్రి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 22న తెలంగాణ అమరుల స్మారక చిహ్నంను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2023-06-14 16:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 22న తెలంగాణ అమరుల స్మారక చిహ్నంను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం రూట్ మ్యాప్, సాంస్కృతిక ప్రదర్శనలు, సభ, అతిథులకు ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రతిష్టాత్మకంగా స్మారక చిహ్నం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్.ఈ హఫీజ్, ఈ.ఈ నర్సింగరావు, బాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News