UPSC తరహాలో టీఎస్‌పీఎస్సీని రూపొందిస్తాం: మంత్రి ఉత్తమ్

ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో జరిగిన తప్పులపై స్పందించారు.

Update: 2024-01-04 14:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో జరిగిన తప్పులపై స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌ను కలవబోతున్నట్లు తెలిపారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని.. ఇకపై రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. యూపీఎస్‌సీ తరహాలోనే టీఎస్‌పీఎస్‌సీని కూడా రూపొందిస్తామని చెప్పారు.

ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఈ ప్రాజెక్టుతో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో గల 10 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగు నీరు, అలాగే తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో తాగునీటి పనులు, రెండో దశలో సానునీటి పనులు జరుగుతున్నాయన్నారు.

Tags:    

Similar News