Minister Uttam: కులగణనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
కులగణన (Cast Census) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే కులగణన (Cast Census) చేపడుతామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టో (Manifesto)లో కూడా తాము అధికారంలోకి రాగానే కులగణన ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయా వేదికల మీద చెప్పామని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను (BC Reservations) పెంచబోతున్నామని.. అందుకోసం డెడికేటెడ్ కమిషన్ (Dedication Commission) వేశాం మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
అదేవిధంగా 2025 జనవరి నంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. దేశంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ధాన్యం సేకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎక్కడా అవాంతరాలు ఎదరవకుండా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
👉Also Read : CM Revanth Reddy: కులగణనను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు