పసుపు బోర్డు ఏర్పాటుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. గత ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆదివారం రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

Update: 2024-02-18 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. గత ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆదివారం రాసిన లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు రైతుల చిరకాల వాంఛ అని గుర్తుచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రైతులు నామినేషన్లు వేసి మరీ నిరసనలు తెలిపిన విషయాన్ని లేఖలో తుమ్మల ప్రస్తావించారు. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల చేసినా ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది క్లియర్‌గా చెప్పలేదని పేర్కొన్నారు.

ప్రతి ఏటా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిపోతోందని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా, తెలంగాణ పర్యటనలో భాగంగా గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. అనంతరం పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఏర్పాటుపై క్లారిటీ లేదు. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే బోర్డు ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని ప్రధానికి మంత్రి లేఖ రాసి గుర్తుచేశారు.

Tags:    

Similar News