Minister Thummala: ప్రభుత్వానికి నేతన్న భారం కాదు: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
మనిషికి కట్టుకోవడానికి బట్టనిచ్చే నేతన్న ప్రభుత్వానికి భారం కాబోడని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మనిషికి కట్టుకోవడానికి బట్టనిచ్చే నేతన్న ప్రభుత్వానికి భారం కాబోడని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలో పీపుల్స్ ప్లాజాలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రాచీన కళ అయిన చేనేతను కాపాడుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందన్నార. పద్మశాలీలను ఆదుకునేందుకు తాత్కాలిక పథకాలు కాకుండా వారికి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేందకు శాశ్వత పథకాలను అందుబాటులోకి తీసుకోస్తామని అన్నారు.
సీఎం అమెరికా పర్యటన ముగిసిన వెంటనే చేనేత కార్మికుల అభ్యున్నతికి ఎలాంటి పథకాలను ప్రవేశ పెడితే బాగుటుందనే విషయాలపై ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రైతున్నకు చేస్తున్న సాయం మాదిరిగానే నేతన్నకు అంతకంటే ఎక్కువ సాయం చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన స్టాక్‌ను త్వరలోనే కొనుగోలు చేస్తామని, అవసరం అయితే ఇతర రాష్ట్రాలకు మన చేనేత ప్రాముఖ్యతను వివరించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో స్టాక్ కొనుగోళ్ల నిమిత్తం రూ.250 కోట్ల మేర ఆర్డర్లు కూడా వచ్చాయని, అవి ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు.