దోషులు ఎవరైనా సిట్ వదిలిపెట్టొద్దు.. రాజకీయ దురుద్దేశ్యంతోనే బీజేపీ ఆరోపణలు : మంత్రి తలసాని

Update: 2023-03-16 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ లో జరిగిన కుట్ర కోణాన్ని సిట్ అధికారులు దర్యాప్తు లోతుగా చేయాలని, దోషులు ఎవరైనా వదిలి పెట్టొద్దు అని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిందన్నారు. చదువుకునే వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చే పడుతోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తోందన్నారు. రాజకీయ ప్రేరేపణ లేకుండా ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తోందని తెలిపారు. కొంత మంది అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగిత్యాల వాసి బీజేపీ కి చెందిన రాజశేఖర్ రెడ్డి ఈ కుట్రలో నిందితుడిగా ఉన్నాడన్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి గ్రూప్స్ లో ఇంకా సెలెక్ట్ కాలేదని, రాజకీయ దురుద్దేశ్యంతోనే బీజేపీ ఆరోపణలు చేస్తోందన్నారు. బీజేపీ కి యూత్ దూరం అవుతుందనే కుట్రతోనే పేపర్ లీక్ జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీలో స్కాంలు జరిగాయని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ కి ఉన్న నిబద్ధత.. దేశంలో ఏ నియామక బోర్డుకు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ యువతను ఎక్కడ పార్టీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 లక్షల ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.

Tags:    

Similar News