‘వార్’ మొదలెట్టిన హరీష్ రావు.. మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయ్యింది. రైతు బంధు స్కీమ్ నిధుల పంపిణీపై మాజీ మంత్రి

Update: 2023-12-09 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయ్యింది. రైతు బంధు స్కీమ్ నిధుల పంపిణీపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు ఇస్తామని చెప్పారు, వడ్లు అమ్ముకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని రైతులకు చెప్పారు, రైతు బంధు పెంచుతామని హామీ ఇచ్చారు.. మరీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు ఎప్పుడూ కొంటారు, పెంచిన రైతు బంధు ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి సీతక్క రంగంలోకి దిగి హరీష్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్‌లకు రైతు బంధు పడలేదని బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నియామావళిని ఇష్టానుసారంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

రైతు బంధు స్కీమ్‌ విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపిన తర్వాత రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఇక, తనకు మంత్రిగా కేటాయించిన శాఖలను బాధ్యతతో నెరవేరుస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలు కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 14 తేదీ నుండి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇరు పార్టీల నేతల మధ్య మాటలు తుటాలు పేలడం ఖాయమని తెలుస్తోంది. విద్యుత్ శాఖపై లోతుగా సమీక్ష జరిపిన కాంగ్రెస్ సర్కార్.. అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా ప్లాన్ చేస్తుండగా.. బీఆర్ఎస్ సైతం ప్రభుత్వానికి దీటుగా కౌంటర్ ఎటాక్ రెడీ చేసినట్లు సమాచారం. దీంతో ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ఎలా ఉండబోతోంది అని ఉత్కంఠ నెలకొంది.


Similar News