ముందు వాటి గురించి మాట్లాడు కేటీఆర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మహిళలపై జరిగిన దాడులు, ఘోరాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-08-18 15:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మహిళలపై జరిగిన దాడులు, ఘోరాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషనుకు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బావుటుందని సీతక్క సలహా ఇచ్చారు. 2014 -2023 మధ్య మహిళలపై రాష్ట్రంలో జరిగిన క్రైం డాటా మొత్తం తన దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. కావాలంటే.. కేటీఆర్ కు ఆ డాటాను ఇస్తానని చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎన్సీఆర్బీ) డేటాను మీడియాకి మంత్రి రిలీజ్ చేశారు. ఆ నివేదిక‌ల్లోనే ప్రతి ఏటా తెలంగాణ‌లో మ‌హిళ‌ల మీద నేరాలు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. 2014 లో 14,417.., 2015 లో 15,425.., 2016లో 15,374.., 2017 లో 17,521.., 2018 లో 16, 027.., 2019 లో 18,394.., 2020 లో 17,791.., 2021 లో 20,865.., 2022 లో 22,066.. కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. తాము కూడా మహిళా కమిషన్ ను కలుస్తామని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయో తాము నివేదిస్తామని వివరించారు. మాట్లాడనంటూనే వారి పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ తమను తిట్టిస్తున్నాడని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ తాము పూర్తిగా రుణమాఫీ చేయకముందే విమర్శలు ఎందుకని మంత్రి సీతక్క నిలదీశారు.


Similar News