రాఖీ రోజు మహిళా మంత్రిని నిందించడం కేటీ‌ఆర్‌కే చెల్లింది.. సీతక్క కౌంటర్

అన్నాచెళ్లెళ్ల మధ్య ప్రేమ, బంధానికి ప్రతీక రక్షా బంధన్. ఈ పండుగను సోదర సోదరీమణులు పవిత్రంగా జరుపుకుంటారు.

Update: 2024-08-19 15:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్నాచెళ్లెళ్ల మధ్య ప్రేమ, బంధానికి ప్రతీక రక్షా బంధన్. ఈ పండుగను సోదర సోదరీమణులు పవిత్రంగా జరుపుకుంటారు. ఇలాంటి రోజున నా చెల్లి(కవిత) జైల్లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టి ఎమోషనల్ అయ్యారు. దీనికి రాష్ట్ర మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే రాఖీ పండుగరోజున మహిళా మంత్రిని నిందించడం కేటీఆర్‌కే చెల్లిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు చెప్పడం, మహిళా మంత్రిపై అసత్య ప్రచారం చేయడంపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా భద్రతకు తాము పెద్దపీట వేస్తున్నామని సీతక్క అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన వెంటనే తమ ప్రభుత్వం వాయు వేగంతో స్పందించిందని గుర్తుచేశారు. పదే పదే అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన నిజాలైపోవు అని కేటీఆర్‌కు సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు జరిగితే స్పందించిన నాధుడే ఉండకపోయే వాడని అన్నారు.

Tags:    

Similar News