Minister Seetakka: ఆ బాధ్యత టీచర్లు, వార్డన్లదే.. సీతక్క హెచ్చరిక
మంత్రి సీతక్క ఇవాళ సమీక్ష నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల టీచర్లు, వార్డెన్లు జాగ్రత్త వహించాలని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి తదితర అంశాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గిరిజన స్కూల్స్, గురుకుల హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామన్నారు. ఇంకా ఏమైనా సమస్యల ఉండే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.