వీఐపీల దగ్గరున్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు చేస్తాం: మంత్రి పొన్నం
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గరున్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు చేయడానికి సిద్ధమైంది.
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గరున్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని శనివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వంటి వీఐపీల వద్ద ఉండే డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని తెలిపారు.
అనంతరం బస్ కండక్టర్లకు కీలక సూచనలు చేశారు. బస్ కండక్టర్లు అనవసరంగా టికెట్‌లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2023 అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీలో 453, నాన్ జీహెచ్‌ఎంసీలో 3,030 కొత్త ఆటోలు కొంటే.. 2024 జనవరిలో జీహెచ్ఎంసీలో 233, నాన్ జీహెచ్‌ఎంసీలో 1,836 ఆటోలు కొన్నారని చెప్పారు. ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారని అన్నారు.