సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.1225.43 కోట్లు నిధులు విడుదల చేసింది. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించగా, మొదటి దశలో రూ.1225.43 కోట్లు విడుదల చేశారు.

Update: 2024-08-22 17:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.1225.43 కోట్లు నిధులు విడుదల చేసింది. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించగా, మొదటి దశలో రూ.1225.43 కోట్లు విడుదల చేశారు. అయితే పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు రిలీజ్ చేశారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు 65,026 దరఖాస్తులు చేసుకోగా, గత ఆర్థిక సంవత్సరం 31 మార్చ్ వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

వీటిలో ఎమ్మార్వో వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా, ఆర్డీవో వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. అధికారులు ఎంపిక చేసిన 24,038 దరఖాస్తులకు ఇప్పుడు నిధులు మంజూరు అయ్యాయి. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీ ల మీద ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు నిధులు రిలీజ్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News