‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ.. పైరవీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన (వీడియో)
‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, సిటీ బ్యూరో: ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయ హస్తంలో భాగంగా దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని ఎలాంటి ఆధారాలు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు.
కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం ఇచ్చారని, ఇచ్చిన హామీల మేరకు అమలు చేయుటకు ప్రజల వద్దకు పాలన పేరుతో కార్యక్రమాలను జరుగుతుందని, అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేదని తెలిపారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ నుండి కొత్త ప్రభుత్వానికి అన్ని విషయాలలో పూర్తి సహకారం ఉంటుందని, ప్రజా పాలన మంచి కార్యక్రమం అయినందున పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలని అన్నారు. మాకు అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.