రూ.500ల బోనస్‌పై మంత్రి పొన్నం కీలక ప్రకటన

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.500ల బోనస్ ఇచ్చి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Update: 2024-07-30 13:11 GMT
రూ.500ల బోనస్‌పై మంత్రి పొన్నం కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.500ల బోనస్ ఇచ్చి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. సన్న వడ్లకు బోనస్, కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తీరుతామని అన్నారు. రైతులను కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ చూసుకుంటుందని అన్నారు. దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని అన్నారు. కేంద్రం తెచ్చిన ప్రతీ పాలసీకి గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.

అంతకుముందు సభలో పొన్నం ప్రభాకర్ ఎమోషనల్ అయ్యారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి.. మరొక పార్టీ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకునే క్యారెక్టర్ తనది కాదని అన్నారు. ఒకే ప్రభుత్వంలో ఒక మంత్రి మిత్రుడు ఎలా అవుతాడు? ఇంకో మంత్రి శత్రువు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఫ్లై యాష్, ఇసుకపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉద్యమకారులపై రాళ్లు విసిరినవాళ్లు ఇవాళ ఉద్యమకారుల పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీసీలు అంటే ఎందుకంత ఆక్రోశం అని అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News