పండుగ పూట పిల్లల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక రిక్వెస్ట్
సంక్రాంతి పండుగ(Sankranti festival) వేళ హైదరాబాద్ మహా నగర ప్రజలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti festival) వేళ హైదరాబాద్ మహా నగర ప్రజలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్ చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. అందులో రాజా సింగ్ మాట్లాడుతూ.. సంక్రాంతి వేళ నగరంలో యువకులు, పిల్లలు పెద్ద మొత్తంలో పతంగులు ఎగుర వేస్తున్నారు. ఎంతో ఉల్లాసంగా జరిగే ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని.. తమ పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటే ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ రిక్వెస్ట్(Raja Singh's request) చేశారు. అలాగే చైనా మాంజాలతో జాగ్రత్తగా ఉండాలని తమ పిల్లలకు వాటిని కొనకుండా చూడాలని అన్నారు. అలాగే పతంగులు(Patangi) ఎగురవేసే సమయంలో కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. తమ పిల్లలను తెగిన పతంగుల కోసం వెళ్ల కుండ చూసుకోవాలని ఆయన కోరారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి వేడుకలు(Sankranti celebrations) అంటే పతంగుల పోటీతోనే ప్రారంభం అవుతాయి. భోగి ముందురోజు నుంచే నగరంలో పతంగుల ఎగురవేతలు ప్రారంభం అవుతాయి. ఈ పండుగ సందర్భంగా నగరంలో దూల్ పేట లో లక్షల కొద్ది పతంగులు అమ్మడు పోతాయి. ఆ సమయంలో దూల్ పేట(Dul Peta) ప్రాంతం మొత్తం జన సంద్రంగా మారిపోతుంది. అనంతరం భోగి రోజు సాయంత్రం ప్రారంభమయ్యే ఈ పతంగి పోటీలు మూడు రోజుల పాటు, రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ ప్రాంతాల్లో సాయంత్రం అయింది మొదలు.. డీజే పాటలతో హైమాక్స్ లైట్లతో తమ టెర్రస్ లను అలంకరించుకొని యువకులు పెద్ద మొత్తంలో పతంగులను పోటాపోటిగా ఎగురవేస్తున్నారు.