Minister Ponnam: బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-06 05:57 GMT
Minister Ponnam: బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభత్వ (BRS Government) హయాంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో ఊహించని రీతిలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అంబర్‌పేట్ నియోజకవర్గం (Amberpet Constituency)లో పర్యటించారు. అదేవిధంగా పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఊహించని రీతిలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని కామెంట్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ (KCR) కుటుంబం రూ.కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు కలిసే కాంగ్రెస్ పార్టీని ఓడించాని అన్నారు.

అభ్యర్థిని పెట్టకుండా కమలం పార్టీతో గులాబీ దళం కుమ్మక్కైందని కామెంట్ చేశారు. కేటీఆర్‌ (KTR), హరీశ్‌రావు (Harish Rao) నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాయని.. వాళ్లిద్దరూ ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తక్కువ ఓట్ల తేడాతోనే ఓడారని అన్నారు. తెలంగాణ (Telangana) అభివృద్ధికి బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) అడ్డంకిగా మారాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy) అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి అయినా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News