ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ.. మాటిచ్చాం చేసి చూపిస్తున్నాం: మంత్రి పొన్నం
తెలంగాణ రైతులందరికీ ఏకకాలంలోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రైతులందరికీ ఏకకాలంలోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రుణమాఫీ ద్వారా 47 లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభించనుందని వెల్లడించారు. దీంతో తెలంగాణ రైతులకు భారీ ఊరట లభించింది. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్లు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. దీనిపై తాజాగా మంత్రి పొన్నం స్పందించి.. ‘రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పదు.. మొదటి నుంచి ఒకే మాట.. ఇప్పుడు అదే మాట. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చాం. నెరవేర్చే సమయం వచ్చింది. మాటిచ్చాం చేసి చూపిస్తున్నాం’ అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.