దసరా స్పెషల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గుడ్ న్యూస్

దసరా పండుగ(Dussehra festival) సమీపిస్తోన్న వేళ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) శుభవార్త చెప్పారు.

Update: 2024-10-01 14:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ(Dussehra festival) సమీపిస్తోన్న వేళ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) శుభవార్త చెప్పారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పండుగ లోపే అర్హులకు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు అందజేస్తామని అన్నారు. అంతేకాదు.. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వరద ఏరియాల్లో మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమస్యల వివరాలను ఆ డిజిటల్ హెల్త్ కార్డులో నిక్షిప్తం చేసేలా హెల్త్ ప్రొఫైల్ సిస్టమ్ ఉనికిలోకి వస్తున్నదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


Similar News