Minister Ponguleti: మాకు ఎలాంటి భేషజాలు లేవు.. వాస్తవం చెబుతాం

వరద బాధితులను ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదివారం పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Update: 2024-09-08 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరద బాధితులను ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదివారం పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు పర్యటించి పర్యటించి పరిస్థితిని తెలసుకుంటున్నారని అన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవు. వాస్తవ పిరిస్థితిని కేంద్రానికి వివరిస్తున్నాం. రూ.5,489 కోట్ల నష్టం జరిగినట్లు నివేదిక పంపాం. తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు నగరంలోని దంసలాపురం, రాకాసి తండా, గ్రామాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. అనంతరం ఓ పక్షన్ హాల్లో బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి సామాగ్రి, పుస్తకాలు సర్టిఫికెట్స్ అన్నీ వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వరద భాదితులు సహాయం కొంత వేగవంతం చేయాలన్నారు.


Similar News