Ponguleti Srinivas Reddy: క‌లెక్టర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేశారంటే మామూలు విషయం కాదు

రైతుల‌ను న‌ష్టపెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. సమస్యలు విని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.

Update: 2024-11-14 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతుల‌ను న‌ష్టపెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. సమస్యలు విని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌ద్దతి కాదు.. ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంటుందని ప్రకటించారు. ఈరోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు గానే.. రేపు రాజ‌కీయ నాయ‌కుల‌కో, ప్ర‌జ‌ల‌కో జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్న క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారంటే మామూలు విషయం కాదని అన్నారు. అధికారుల మీద దాడి అనేది మ‌న‌మీద మ‌నం దాడి చేసుకున్నట్లే అని తెలిపారు. రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. కుట్ర‌పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నారని అన్నారు.

గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాలని సూచించారు. ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్న‌ట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వ‌స్తారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారం వెల‌గ‌బెట్టిన‌నాడు ఇదే ప‌ద్ద‌తి చేశారా? అని అడిగారు. ఏం త‌ప్పు చేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మ‌ల్లన్నసాగ‌ర్‌లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించారని గుర్తుచేశారు. పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా? అని అడిగారు. ఎగిసి ఎగిసి ప‌డుతున్న కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా? అని మండిపడ్డారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..