సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక హామీ
సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇవాళ పొంగులేటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇవాళ పొంగులేటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాకుండా కార్మికులు సొంత ఇంటి కల కూడా నేరవేరుతుందని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కట్టిస్తామన్నారు. కొత్త గనులు ప్రారంభించి.. సింగరేణిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నెల 27వ తేదీన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.