Minister Ponguleti: ఆరోజు నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన

మార్పు కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు దీవించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.

Update: 2025-01-11 07:47 GMT
Minister Ponguleti: ఆరోజు నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: మార్పు కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు దీవించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం (Khammam)లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు (Ration Cards) ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ, తమ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) కూడా ఇస్తామని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. మొత్తం వారికి నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. 

Tags:    

Similar News