తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజ్.. మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ ఉన్నట్లు అయిందని పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజ్, 500 పడకల ఆసుపత్రి ఉంటుందని చెప్పారు.
దేశంలో ఎక్కడా కూడా ఇలా లేదని, ఏ ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల సాధ్యమైందని చెప్పారు. ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల కోసం వ్యూహ రచనలు చేస్తోంటే ఒక్క కేసీఆర్ మాత్రమే రాబోయే తరానికి మౌలిక సదుపాయాల కల్పనలో బిజీగా ఉన్నారని తెలిపారు.