కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడితోనే అది సాధ్యం: కేటీఆర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరే అని స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరే అని స్పష్టం చేశారు. మేం తెగించి కొట్లాడాం కాబట్టే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట హోటల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారం సాధ్యమని.. లేదంటే ఎవరైనా చెత్తబుట్టలో పడాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తుందని.. దళితులు గొప్పగా ఎదుగుతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు. అందరికీ ఒకే ఓటు ఉంటుందని.. అదానికైనా మనకైనా ఒకటే ఓటు హక్కు అన్నారు. మతాలు కులాలు మనకు మనం పుట్టించుకున్నవేనని స్పష్టం చేశారు.
తెలంగాణ రాకముందు మనల్ని అవహేళన చేశారని, ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చు అన్నారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోందన్నారు. రెండెకరాల స్థలాన్ని రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత గిరిజనులకు దండు మల్కాపూర్ లో డిక్కీకు ఇప్పిస్తాన్నారు. దళితబంధు లాంటి పథకం కేసీఆర్ లాంటి దమ్ము నాయకుడుతోనే సాధ్యం అన్నారు. రెండు మొక్కలు నాటమంటే ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి చేత కాదన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, డిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read...