కాంట్రాక్టర్ అహంకారంతో మునుగోడులో యుద్ధం: కేటీఆర్

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.

Update: 2022-10-11 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌తో దేశాన్ని బీజేపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తుంటే.. తట్టుకోలేని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ నేతలు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగితే నిరాకరిస్తోన్న ప్రధాని మోడీ.. రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని మండిపడ్డారు. అయితే జుమ్లా, లేకపోతే హమ్లా ఇదే ప్రధాని మోడీ స్టైల్ అని ఎద్దేవా చేశారు. చావనైనా చస్తాం కానీ, ప్రధాని మోడీకి లొంగబోమని ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. దేశ ద్రవ్యోల్బనం ఎన్నడూ లేని స్థాయికి చేరిందని, అత్యధిక పేదలున్న దేశం స్థాయికి భారత్ దిగజారిందని, దీనికి మోడీ వైఫల్యమే కారణమన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. రాబోయే జనరల్ ఎన్నికలకు ముందు జరుగుతోన్న ఈ మునుగోడు ఉప ఎన్నిక చిన్న యూనిట్ టెస్ట్ లాంటిదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News