అదే జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సంచలన సవాల్
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కింది. బీఆర్ఎస్(BRS)తో పాటు మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) రెచ్చిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కింది. బీఆర్ఎస్(BRS)తో పాటు మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) రెచ్చిపోయారు. సోమవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే అన్నారు. వందకు వంద శాతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే(Congress Government) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ అలా జరుగకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. నా సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు(Prabhakar Rao) విదేశాల నుంచి వస్తే.. కేసీఆర్ కుటుంబం తప్పకుండా జైలుకు వెళ్తుందని అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని.. మిగిలినవి కూడా అతి త్వరలో అమలు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు(Prabhakar Rao) హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పైనా ప్రభాకర్ రావు కీలక ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని పేర్కొన్నారు. ఎస్‌ఐబీ చీఫ్(SIB Chief)గా నిబద్ధతతో పని చేశానని, అధికారిక పార్టీతో కుమ్మక్కై ఇతర పార్టీలకు చెందిన వారి ఫోన్‌లను ట్యాప్ చేయించాననడం తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నారు. అమెరికా వెళ్లినా దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నానని అన్నారు.