బండ్ల కృష్ణమోహన్ మావోడే.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. మంగళవారం కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.

Update: 2024-07-30 14:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. మంగళవారం కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛాంబర్‌కు వెల్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా అని సీరియస్ అయ్యారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారు.. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లేనా? అని ప్రశ్నించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు, ఆయన ఎక్కడికీ వెళ్లడు అని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్‌ వెళ్తే చూసుకోవడానికి తాను ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు తాను ఒక్కడిని చాలు అని అన్నారు. త్వరలో ప్రధానిని కలుస్తా.. రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్‌కు త్వరలోనే రీ టెండర్లు వేస్తామని చెప్పారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామని అన్నారు.

Tags:    

Similar News