కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్ జెండాతోనే పోతా: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Update: 2024-03-30 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కోమటిరెడ్డి ఏక్ నాథ్ షిండే అవుతారని.. బీజేపీ అగ్రనేతలతో ఆయన ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి ఏక్ నాథ్ షిండే కామెంట్స్‌పై కోమటిరెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయినట్టున్నారని ఫైర్ అయ్యారు. నేను కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండేనో కాదో ఆ దేవుడికే తెలుసని.. మహేశ్వర్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌కు వెన్ను పోటు పొడిచే నయా గాలి జనార్ధన్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలో వచ్చాక పార్టీలో చేరుతా మంత్రి ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి నన్ను కోరారు.. మాకే మెజార్టీ ఉంది అవసరం లేదని చెప్పానన్నారు. అదే మనసులో పెట్టుకుని ఆయన ఇప్పుడు నన్ను ఏక్ నాథ్ షిండే అనడం విడ్డూరమన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీకి ఏదో చెప్పానని అంటున్నారు.. మహేశ్వర్ రెడ్డికి సవాల్ చేస్తున్నా.. అమిత్ షా, గడ్కరీని తీసుకుని రా భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని.. కాంగ్రెస్ జెండాతోనే పోతానని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News