కేసీఆర్‌కు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సిరిసిల్ల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-04-05 14:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సన్నాసుల కామెంట్లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రేపో మాపో కేసీఆర్ కూడా జైలుకు వెళతారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే కాదు.. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుకు కూడా జైలులో బెర్త్ ఖరారు అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఫస్ట్రేషన్‌లోనే కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉందని అన్నారు. ఆ ఆస్తులన్నీ వసూలు చేసి ప్రజలకు పంచి పెడతామని కీలక ప్రకటన చేశారు. ‘నేను ఇంకా అద్దె ఇంట్లోనే ఉన్నాను. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఎప్పుడూ కాంట్రాక్టర్ పనులు కూడా చేయలేదు. రాష్ట్రంలోనే నేనే అసలైన ఉద్యమకారుడిని’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ అంటోంది.. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.

Tags:    

Similar News