Komatireddy Venkat Reddy: 20 ఏండ్లు అధికారంలో ఉంటాం

లక్షలమంది సాక్షిగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ప్రకటించారు.

Update: 2024-11-18 15:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లక్షలమంది సాక్షిగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ప్రకటించారు. ఈ నేపథ్యంలో పనులు డిసెంబర్ మొదటి వారం కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రజల బాగుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, వారి ఆశీర్వాదం ఉంటే ఏ పక్షం కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీదేనని తేల్చిచెప్పారు. అనంతరం నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి.. నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..