తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలిక దుర్గకు అండగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్ తరోడ గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్ తరోడ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే కన్న తల్లికి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఏం చేయలేని స్థితిలో దాతలు ఆదుకోవాలి కోరింది. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడంతో పలువురు దాతలు స్పందించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించి పెద్దమనుసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలిక దుర్గకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ. లక్ష సహాయం అందించారు. అలాగే బాలిక చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని.. స్థానిక అధికారులతో మాట్లాడి బాలికకు ఇల్లు కూడా సమకూరుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.