Jupalli Krishna Rao: అందుకోసమే రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు: జూపల్లి

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-20 08:33 GMT
Jupalli Krishna Rao: అందుకోసమే రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు: జూపల్లి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆదాయం పెంచి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మిస్ వరల్డ్ పోటీల ప్రధాన ఉద్దేశం అని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) అన్నారు. వచ్చే మే నెలలో హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ లో ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. అందాల పోటీని మహిళా సాధికారత కోణంలో చూడాలని మిస్ వరల్డ్ పోటీలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోకుండా పాజిటివ్ కోణంలో చూడాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి ఈ మిస్ వరర్డ్ పోటీలకు హాజరవుతున్నారని అంతర్జాతీయ మీడియా ఈ ఈవెంట్ కు వస్తుందన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందన్నారు. గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో టూరిజం (Telangana Tourism) పాలసీ లేదని దాంతో టూరిజంలో రాష్ట్రానికి ఆదాయం లేదని విమర్శించారు. ప్రభుత్వం టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

Tags:    

Similar News