తెలంగాణపై మొసలి కన్నీళ్లు ఆపండి.. మంత్రి హరీష్ రావు కౌంటర్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై దొంగ ప్రేమ మొసలి కన్నీళ్లు ఆపాలి అని రాహుల్ గాంధీకి మంత్రి హరీష్ రావు సూచించారు.

Update: 2022-03-29 08:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై దొంగ ప్రేమ మొసలి కన్నీళ్లు ఆపాలి అని రాహుల్ గాంధీకి మంత్రి హరీష్ రావు సూచించారు. ట్విట్టర్ లో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు నైతికత బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని అని పేర్కొనడంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునే వాళ్ళు అయితే పార్లమెంటులోనూ సభ్యులతో కలిసి చేయాలని సూచించారు. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పనిచేయాలని కోరారు. వన్ నేషన్ వన్ ప్రో క్యూర్ మెంట్ పై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువు తీసుకోకండి అని హితవు పలికారు.

Tags:    

Similar News