రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య చీకటి ఒప్పందం: మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2023-03-05 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రచారం కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కటేనని.. ఈ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మంత్రి గంగుల సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ పాదయాత్ర ఒక ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News