కేసీఆర్ తర్వాత సీనియర్ ఎవరూ.. నెంబర్ 2 కేటీఆర్ కాదా.. కొత్త చర్చకు తెరలేపిన మంత్రి కామెంట్స్..?
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పటివరకు కేసీఆర్ సుప్రీం అని, ఆయనే సీనియర్ అని ఉండేది. సడన్‌గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేనే సీనియర్ అని పేర్కొనడంతో కేడర్‌లో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ ఉండేది ఇప్పుడు ఎర్రబెల్లితో ఆయనేనా అనేది ఇటు పార్టీతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఒక్కసారి చర్చనీయాంశమైంది. అయితే దయాకర్ రావు సీనియర్ అయితే ఆయన అనుచరులకు రాబోయే ఎన్నికలకు ఎన్ని టికెట్లు ఇప్పించుకుంటారు.. పార్టీలో ఆయన స్థానం ఏమిటి?.. ఇంతకు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లేస్ ఏంటీ అని నేతల్లో హాట్ టాఫిక్ అయింది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్తరువాత తానే సీనియర్ అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరిలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా వరుస విజయాలతో సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో నెగ్గుతున్నానని పేర్కొన్నారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెనుదూరమే లేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఇంతకు సీనియర్ ఎవరూ అనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు కేసీఆర్ తర్వాత సీనియర్ కేకే అని, పార్టీలో మాత్రం కేటీఆర్ అని ఉంది. అయితే ఎర్రబెల్లి మాటలతో పార్టీ కేడర్ లో గంధరగోళం నెలకొంది.
తెలిసి వ్యాఖ్యలు చేశాడా? కావాలనే మాట్లాడాడా అని నేతలు చర్చించుకుంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది 2016లో అని ఆయన స్వయంగా పేర్కొన్నప్పటికీ సీనియర్ ను అని పేర్కొనడం దుమారంనకు కారణమైంది. కేసీఆర్ తర్వాత నేనే అనడంతో మరీ కేటీఆర్ స్థానం పార్టీలో ఏమిటీ? ఆయన ఏ పాత్ర పోషిస్తారనేది కూడా చర్చకు దారితీసింది. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న కేటీఆర్ కే చెక్ పెట్టేలా ఎర్రబెల్లి మాట్లాడినట్లుందని కేడర్ గుస్సా అవుతున్నారు.
అనుచరులకు ఎంతమందికి టికెట్?
కేసీఆర్ తర్వాత నేను అని చెప్పుకుంటున్న దయాకర్ రావు అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఈ తరుణంలో ఎంతమంది అనుచరులకు టికెట్ ఇప్పించుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏయే నియోజకవర్గాల్లో అనుచరులలో ఎంతమందిని పోటీ నిలబెడతారు?.. గెలిపించుకుంటారనేది సైతం హాట్ టాఫిక్ గామారింది.
ఎప్పుడు ఏదో ఒక అంశంతో చర్చల్లో ఉండే దయాకర్ రావు ఇప్పుడు కేసీఆర్ తర్వాత తానే అని చెప్పుకుంటుండటం ఎంతవరకు ఆయనకు కలిసి వస్తుందో చూడాలి. ఈ వ్యాఖ్యలు ఎటుదారితీస్తాయో చూడాలి. ఎర్రబెల్లిని చూసి మరోనేత ఇలాంటి కామెంట్ చేస్తే పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేకపోలేదు. అయితే దీనిపై పార్టీ స్పందిస్తుందా? లేకుంటే లైట్ గా తీసుకుంటుందా? అనేది చూడాలి. ఒకవైపు కవిత ఎపిసోడ్ కొనసాగుతుండగా, ఇప్పుడు ఎర్రబెల్లి వ్యాఖ్యలు పార్టీ పెను దూమరం లేపుతున్నాయి.