బీఆర్ఎస్ గెలిచే సీట్ల సంఖ్య తేల్చి చెప్పిన మంత్రి ఎర్రబెల్లి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచారు. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూ.. గెలిస్తే ఏం చేస్తామో వివరిస్తూ ప్రజల్లోకి

Update: 2023-11-18 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచారు. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూ.. గెలిస్తే ఏం చేస్తామో వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తిలో సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం హోరెత్తిస్తున్నారు. తనదైన శైలీలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ఎర్రబెల్లి దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బీఆర్ఎస్‌కు 80 సీట్లు గ్యారెంటీ అని మంత్రి ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మూడవ సారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తన సర్వేలు, అంచనాలు ఎప్పుడు తప్పు కాలేదని అన్నారు. అంతేకాకుండా ఈ సారి పాలకుర్తిలో తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మరని, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని విమర్శలు గుప్పించారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..