Damodara Rajanarsimha : ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం : వైద్య శాఖ మంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నామని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

Update: 2024-08-18 12:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నామని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇవాళ హైదరాబాదులోని ఫిలిం నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ.. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అండ్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను ప్రజలకు మరింత అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్న డాక్టర్లను మంత్రి అభినందించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. వైద్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర కీలకమని చెప్పారు. ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సృశాంత్, క్లినిక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News