MLC అభ్యర్థి విషయంలో ఓవైసీ కీలక నిర్ణయం.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్!
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా.. మీర్జా రెహమత్ బేగ్ను ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా.. మీర్జా రెహమత్ బేగ్ను ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. నిన్నటి వరకు ప్రస్తుత ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ నేతలే స్వయంగా ప్రకటించినప్పటికీ.. అనూహ్యంగా మంగళవారం మీర్జా రహమత్ బేగ్ను తెర మీదకు తెచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ సైతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ప్రకటన విడుదల చేశారు. అయితే జాఫ్రీ ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. దీంతో ఆయన సేవలను పార్టీకి వినియోగించుకోనున్నట్లు సమాచారం. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో మీర్జా రెహమత్ బేగ్ను అభ్యర్థిగా ప్రకటించి.. ఈనెల 23న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.