MIM కంచుకోట.. పాతబస్తీలో హ్యాట్రిక్ కొట్టిన హిందూ నేత ఎవరో తెలుసా..?

పాతబస్తీ ఎంఐఎంకు కంచుకోట.

Update: 2023-10-30 17:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ ఎంఐఎంకు కంచుకోట. ముస్లిం క్యాండిడేట్లు మాత్రమే ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఎంఐఎం గెలిచే స్థానాల్లో ఇతర పార్టీల నుంచి ఎవరు బరిలో నిలిచిన వారు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. అయితే ఇలాంటి పాతబస్తీలో ఓ నేత ఏకంగా మూడు సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అతనే బద్దం బాల్ రెడ్డి. కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడు సార్లు బీజేపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు.

హ్యాట్రిక్ ఇలా..

బాల్ రెడ్డిది హైదరాబాద్ పాతబస్తీ అలియాబాద్. కాగా విద్యార్థిగా ఉన్ననాటి నుంచి జనసంఘ్ లో పనిచేశారు. అనంతరం బీజేపీలో పని చేశారు. 1985, 1989, 1994లో బాల్ రెడ్డి వరుసగా గెలుపొందారు. దీంతో బాల్ రెడ్డిని స్థానికంగా ‘కార్వాన్ టైగర్’ అని పిలుచుకుంటారు. తర్వాత వరుసగా ఆయన ఓటమి చవిచూశారు. చివరిసారిగా 2018లో రాజేంద్రనగర్ నుంచి ఆయన బరిలో దిగారు. 2019లో ఆయన కన్నుమూశారు. అయితే జీవితకాలం ఆయన ఒకే పార్టీలో కొనసాగారు.

లోక్ సభ ఎన్నికల్లో 1991లో పోటీ చేసిన బాల్ రెడ్డి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి సైతం టగ్ అఫ్ వార్ పోటీ ఇచ్చారు. 1998లో సైతం బాల్ రెడ్డి ఎంఐఎంకు గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. కాగా ప్రస్తుతం గోషామహల్ స్థానం నుంచి రాజాసింగ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచారు. మూడో సారి గెలిస్తే బాల్ రెడ్డి రికార్డును రాజాసింగ్ తిరగరాసిన వారు అవుతారు. 

Tags:    

Similar News