METRO RAIL: నగరవాసులకు బంపర్ న్యూస్.. వాట్సప్‌ నుంచే మెట్రో టికెట్ల బుకింగ్ (బుకింగ్ ప్రాసెస్ ఇలా..)

మారుతున్న కాలానికి అనగుణంగా హైదరాబాద్ మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-03-08 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలానికి అనగుణంగా హైదరాబాద్ మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.నగరంలో ట్రాఫిక్‌ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ప్రయాణికులు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. కానీ, మెట్రో స్టేషన్లలో టికెటక్ కౌంటర్ల వద్ద బారులు తీరుతుండటంతో కొంత ప్రయాణికులు బస్సులో వెళ్లేందుకు ప్రధాన్యతను ఇస్తున్నారు. మరికొందరు మెట్రో స్టేషన్‌కు వెళ్లాక ఫోన్‌ పే, పేటీఎం లాంటి యాప్స్‌తో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సులభంగా టికెట్ తీసుకునేందుకు వాట్సాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులో తీసుకోచ్చారు.

వాట్సాప్‌లో టికెట్ బుకింగ్ ఇలా..

ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 918341146468 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. అనంతరం ఈ నంబర్‌కు వాట్సాప్‌ 'Hi' అని మెసేజ్‌ పంపాలి. వెంటనే మీకు ఒక ఓటీపీతో పాటు ఈ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి ఒక యూఆర్‌ఎల్ గేట్‌వే వస్తుంది. ఆ టికెట్‌ బుకింగ్ URL లింక్‌పై క్లిక్‌ చేయగానే డిజిటల్‌ గేట్‌వే వెబ్ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌, రూపే డెబిట్‌ కార్డు వంటి వాటితో పేమెంట్ చేయాలి. పేమెంట్‌ పూర్తయిన వెంటనే మీకు మీ వాట్సాప్‌కు ఈ టికెట్‌ URL వస్తుంది. ఆ ఈ టికెట్‌ URL డౌన్‌లోడ్‌ చేసుకొని స్టేషన్‌లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే టికెట్‌ జనరేట్ చేస్తామో.. అప్పటి నుంచి 24 గంటలోపు ఆ టికెట్‌ను ప్రయాణికులు వినయోగించుకోవచ్చు. 

Tags:    

Similar News