వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడ్రోజులు ఇళ్ల నుంచి బయటకు రాకండి

తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2023-11-23 12:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని స్పష్టం చేసింది. రాత్రి కూడా చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈనెల 26 వరకు చెదురుమెుదురుగా వర్షాలు ఉంటాయని భారీ వర్షాలకు మాత్రం పడే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..