తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక

గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాల్పులతో ఇంట్లో ఉండలేక, అడుగు బయటపెట్టలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Update: 2024-05-02 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాల్పులతో ఇంట్లో ఉండలేక, అడుగు బయటపెట్టలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండలను తట్టుకోలేక ఇప్పటికే అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో మృతిచెందారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. మండుటెండలను దృష్టిలో పెట్టుకొని గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయని.. 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని సూచనలు చేసింది. రేపు కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 4,5 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో హైటెంపరేటర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..