మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ హె
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు వడగాలులు వీసే అవకాశముందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. భారీ ఉష్ణోగ్రతలతో ఎడాలి ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశముందని, అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.