బ్రేకింగ్: రానున్న గంటలో తెలంగాణలో వర్షం!
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా దంచికొడుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా దంచికొడుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న గంటలో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని నల్గొండ, చిట్యాల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, యాదాద్రి, కామారెడ్డి, నిర్మల్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ సాయంత్రం వరకు కొన్నిచోట్ల పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచన చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఇక, తెలంగాణలో గత కొన్ని రోజులు నుండి ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. వేడికి అల్లాడిపోతున్న వేళ నగరంలోని కొన్ని చోట్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుండి ఎండలు దంచికొట్టినప్పటికీ మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వాతవరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వాతావరణం చల్లబడింది.